సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దసరా మహోత్సవం వైభవంలో భాగముగా నేడు, గురువారం శ్రీ అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో దర్శనం ఇచ్చారు. దీనికి పెద్దపుల్లేరు గ్రామానికి చెందిన కదిలింది మురళి కృష్ణంరాజు, శుభ దంపతులు సౌజన్యం వహించారు. రేపు శుక్రవారం (26 వ తేది) సాయంత్రం 6 గంటలకు శ్రీ అమ్మవారితో..దీపపు కాంతులతో ఆధ్యాత్మిక మమేకం చెందటానికి .. విశేషమైన.. ఊంజల్.. సేవ..జరుపబడుతుంది అని, ఎల్లుండి 27 వ తేది.. శనివారం ఉదయం 9 గంటలకు.. దేవాలయం చుట్టూ 7 ప్రదక్షిణలు అంటే హిందూ పురాణలలో పేర్కొనబడిన సప్త లోకాలుకు ప్రదక్షిణ భాగ్యాన్ని కలిగించే.. సప్త ప్రాకార సేవ.. అత్యంత వైభవం గా నిర్వహిస్తున్నామని, దేవస్థానం ప్రధాన అర్చకులు. బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ తెలియచేసారు.. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు విశేషంగా హాజరు కావాలని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ధ మాహాలక్ష్మి నగేష్. కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *