సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి సోమవారం మధ్యాహ్నం ‘నరసాపురం – చెన్నై’ వందే భారత్ రైలు ను ప్రారంభించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అదే రైల్లో రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, నరసాపురం,ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లు బొమ్మిడి నాయకర్ లతో కలసి ఒకే బోగీలో ప్రయాణిస్తూ భీమవరం చేరుకోగానే భీమవరంలో ఆయన అభిమానులు, కూటమి నేతలును, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధ సారధి, స్థానిక వ్యాపార ప్రముఖులు రైలు నుండి ఆయనకు ఘన స్వగతం పలికారు. భీమవరం లో అన్ని ప్రధాన సెంటర్స్ లో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ను అభినందిస్తూ భారీ ఫెక్సీలు వ్యాపార సంస్థలు, టౌన్ హాలువారు, విద్య సంస్థలు నేతృత్వంలో ఏర్పాటు చెయ్యడం పండుగ వాతావరణం నెలకొంది. నర్సాపురం, భీమవరంలో కేంద్ర మంత్రి వర్మ ను అభినందిస్తూ ఆయనకు బైక్ ఫై ఎక్కించుకొని కూటమి నేతలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *