సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నాచువారి సెంటర్ లోని శ్రీపంచముఖ ఆంజనేయ స్వామివారి 9వ వార్షిక మహోత్సవ ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యే అంజిబాబు సతీమణి సత్యవాణి పాల్గొని మాట్లాడారు. ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలంటే ధ్యానం, భక్తి, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయన్నారు. 7 రోజులపాటు స్వామివారి వార్షిక మహోత్సవంలో సంప్రదాయ బద్దంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం శుభ పరిణామమన్నారు.అనంతరం సత్యవాణికు గదను అందించి సత్కరించారు. నిర్వాహకులు, డా గోవింద బాబు, ఉప్పలపాటి ప్రభాకర్ రావు,కాగిత వెంకట రమణ,సుంకర్ దాసు , తదితరాలు మాట్లాడుతూ ఈనెల 30 వ తేదీన ఉదయం భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *