సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం అనాకోడేరు శ్రీభీమేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మ కర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. చైర్మన్ గా యర్రంశెట్టి వెంకటేశ్వర రావు, సభ్యులుగా ముదుండి రమేష్ రాజు, వేమన మహాలక్ష్మి, గోపావర్జుల అన్నపూర్ణ, దంపనబోయిన కుమారస్వామి, కేశబోయిన వెంకట లక్ష్మీ, ఉబ్బా వీరమ్మ, రైవాడ నూకరాజు, నౌడ్రో పాపమ్మ, మద్దిరాల సుబ్బారావు లు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. ఎంతో పురాతనమైన చరిత్ర కలిగిన దేవాలయం భీమేశ్వర స్వామి దేవస్థానమని, ఈ దేవాలయాన్ని పునః నిర్మాణం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారని, త్వరలోనే ఈ దేవాలయ పునః నిర్మాణం చేయిస్తామని అన్నారు. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులుపాల్గొన్నారు.
