సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం రాయలం గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ శిఖర విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవాన్ని సంప్రదాయ బద్ధంగా వేద మంత్రాలతో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కోయ్యే మోషేన్ రాజు, డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు,ఎపిఐఐసి చైర్మన్ మంతెన రామరాజు పూజ కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వారు మాట్లాడుతూ.. ఎంతో పురాతన దేవాలయమైన శ్రీమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానాన్ని పునః ప్రతిష్ఠ జరుపుకోవడం శుభ పరిణామమని అన్నారు. ధర్మకర్త చైర్మన్ చినమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహంతోపాటు జ్ఞాన సరస్వతి శిలా విగ్రహం, శ్రీ సద్గురు సాయిబాబా, సాయినాథుని పాదుకా, శ్రీఅభయ ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠ చేశామని అన్నారు.
