సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి ఆషాడ మాసం సందర్భంగా నేడు, సోమవారం స్థానిక మోటుపల్లివారి వీధిలోని శ్రీ అమ్మవారు పూరిగుడి నుండి మహిళా సేవకులు భారీ ఎత్తున ఊరేగింపుగా పట్టణంలో తిరిగి. సారె సమర్పించారు. గతంలో కనివిని ఎరుగని రీతిలో సారెలు ప్రదర్శనలతో ఆధ్యాత్మిక శోభా తో ఆ ప్రాంతం అంతా సందడిగా మారింది. ఈ సందర్బంగా అనకాపల్లి కి చెందిన సంప్రదాయ బెల్లం రుచులు అధినేత.. శిలపరశెట్టి శ్రీనివాసరావు సుజాత దంపతులు.రసాయనాలు కలవని బెల్లంతో తయారు చేసిన శ్రీ మహాలక్ష్మి స్వరూపాలు అయిన.. రోలు, తిరగలి, సన్నికల్లు అమ్మవారికి కానుకగా సమర్పించారు. మరియు భీమవరం పట్టణం తో పాటుగా, కర్నూల్, గూట్లపాడు తదితర ప్రాంతాలు నుండి వచ్చిన 600 మంది మహిళా భక్తులు సుమారుగా 3000 కేజీల సారెను ఊరేగింపుతో శ్రీ అమ్మవారికి సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ వీరికి పూజలు ఆశీర్వచనం నిర్వహించారు. ఈ సారె కార్యక్రమం ఘనంగా జరగడానికి సహకారం అందించిన మద్దాల విజయలక్ష్మి, సరిపల్లి రజని, వాణి, మహాలక్ష్మి, మీనాక్షి, గూట్లపాడు కు చెందిన దేవి ఆదిలక్ష్మి తదితరులను అలాగే.. అన్నమాచార్య కీర్తనలు సంస్థ నుండి రావూరి రమాదేవి, శ్రీ పద్మావతి వేంకటేశ్వర కోలాటం సంస్థ నుండి గొట్టుముక్కల పద్మావతి తదితరులను దేవస్థానం తరపున సత్కరించి మరియు వచ్చిన భక్తులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
