సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ పురాధీశ్వరి..బంగారు తల్లి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం చేసేందుకు ఏర్పాటు చేసిన స్వర్ణ నిధికి అండలూరు చెందిన శ్రీ అమ్మవారి భక్తులు చిలుకూరు రాంబాబు కుసుమరాణి దంపతులు లక్ష ఎనభై వేలు విలువ చేసే 12 గ్రాములు బంగారం కానుకగా సమర్పించారు,వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించినారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం మరియు ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం ధరకర్తలు రామాయణం శ్రీనివాస్,ఉడిశి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్,గుసిడి నాగశిరీష,గొంతిన రమణ,యండ సత్యవతి,మిర్తిపాటి గుణేశ్వరరావు,పాపొలు ఏడుకొండలు ప్రసాదాలు శ్రీ అమ్మవారి ఫోటో అందజేశారు..
