సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ వారి దేవాలయంలో మూలవిరాట్ దర్శనం లేనప్పటికీ భక్తులు విశేషంగా వచ్చి శ్రీ అమ్మవారి ప్రతిరూప విగ్రహాలను దర్శించుకొని తమ మ్రొక్కులు చెల్లించుకొంటున్నారు. నేడు, శనివారం శ్రీ అమ్మవారి ఆలయానికి వచ్చిన బెంగుళూరు కి చెందిన భక్తులు బి వెంకట నరసింహ మూర్తి 50000 (యాభై వేలు రూపాయలు) మరియు ఎన్ కామేశ్వర సుహాస్ 50000( యాభై వేలు రూపాయలు) దేవాలయంలోని నిత్యా అన్నసమారాధన ట్రస్ట్ కు కానుకగా దేవాలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ కు అందజేశారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించి శేషవస్త్రం ప్రసాదాలు ఫోటో అందజేశారు.
