సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్; భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రతి రోజు దూరప్రాంతాల భక్తుల కోసం జరిగే నిత్యాన్నప్రసాద వితరణ ట్రస్ట్ కు కీ”శే. సుంకర శ్యామల బ్రహ్మాజీ రావు పేరు మీద వారి కుటుంబ సభ్యులు ₹ 1,12000/- ఒక లక్ష పన్నెండు వేలు రూపాయలు కానుకగా అందచేసారు. వీరికి దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. వీరికి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ఫోటో అందచేసారు. ధర్మకర్తలు పాపోలు ఏడుకొండలు, గొంతిన రమణ పాల్గొన్నారు
