సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఓం శ్రీ మాత్రే నమః గత నెల రోజులుగా అంగరంగ వైభవంగా జరిగిన భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మవారి 62 వ వార్షిక మహోత్సవాలు ముగింపు నేపథ్యంలో రేపు శుక్రవారం శ్రీ అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు అన్న ప్రసాదాలను అందివ్వనున్నారు. నేడు గురువారం శ్రీ ధనలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు( ఫై ఫొటోలో). రేపు శుక్రవారం ఉదయం 7.30 నిమిషాలకు శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి మూలా విరాట్ ముందు మహా నైవేద్య ప్రసాద నివేదన పూజ కార్యక్రమం జరుగును. తదుపరి నీరుల్లి పండ్ల వర్తక సంఘం , ఉత్సవ కమిటీ, భక్తులు కానుకల సహకారంతో ఉదయం 8 గంటల నుంచి అఖండ అన్న సమారాధన ప్రారంభం అయ్యి సాయంత్రం వరకు కొనసాగుతుంది.. దీనికోసం రెస్ట్ హౌస్ రోడ్డు నుండి ట్రాఫిక్ నిలిపివేశారు. భోజన ఏర్పాట్లు కు నేటి రాత్రి నుండే లక్ష మంది భక్తుల కోసం టన్నుల కొద్దీ కూరగాయలు బియ్యం తో భారీ వంటలు ప్రారంభం కానున్నాయి
