సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో వైభవంగా నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రులలో భాగంగా నేడు, బుధవారం ఉదయం మూలనక్షత్రం నేపథ్యంలో నేడు, శ్రీ సరస్వతి దేవి అలంకారంలో శ్రీ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. సందర్భంగా వందలాది స్కూల్ విద్యార్థులుచే వారి తల్లులతో ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ పందిరిలో వారికీ జ్ఞాన ప్రాప్తి విద్యాప్రాప్తి, మంచి భవిషత్తు అనుగ్రహించాలని శ్రీ సరస్వతి పూజను బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ భక్తి శ్రద్దలతో చేయించారు. తదుపరి విద్యార్థులు అందరికి వేమన శతకం, పుస్తకాలూ పెన్నులు, ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ అందజేసి విద్యార్థులకు శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారి అమ్మవారి అస్సిసులు అందజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *