సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి సంక్రాంతి నుండి నెల రోజులు పాటు పెద్ద ఎత్తున నిర్వహించే ‘వార్షిక మహోత్యవములు’ నేపథ్యంలో దేవాలయం ఆవరణలో నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో భారీ చలువ పందిళ్లు ఏర్పాటు పూర్తీ కావస్తుంది, ఇక లైటింగ్ అలంకరణలు, పందిళ్ళకు సీలింగ్ అలంకరణలు ఫ్యానులు ఏర్పాటు తదుపరి ప్రారంభిస్తారు ఇదిలా ఉండగా.. శ్రీ అమ్మవారు గర్భాలయం శుద్ధి.. 10అడుగుల నిలువెత్తు శ్రీ అమ్మవారికీ నూతన అలంకరణ తదితర పనులు నిమిత్తం మూలవిరాట్ దర్శనంను తాత్కాలికముగా నిలుపుదల చేశారు.. ప్రస్తుతం పనులు శరవేగముగా పూర్తి చేస్తున్నారు..ఈ నెల 29 న అనగా..అశ్వని నక్షత్రం దశమి తిధి.. సోమవారం నాడు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు వేదపండితులు ఆధ్వర్యం లో వివిధ హోమాలు, విశేష పూజలు అనంతరం కళాన్యాసము జరిపి.ఉదయం 11 గంటల నుండి యదావిధిగా పునఃదర్శనం పునరుద్దరించబడుతుంది అని, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *