సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో గత రాత్రి కార్తీక లక్ష దీపోత్సవం ఘనంగా నిర్వహించిన శ్రీ అమ్మవారి మాలధారణ దీక్షాపరులచే నేడు, శనివారం ఉదయం శ్రీ అమ్మవారికి సారె సమర్పణ ఎక్కడ కనివిని ఎరుగని రీతిలో అత్యంత వైభవముగా జరిగింది..ఈ కార్యక్రమం లో వందలాది దీక్షాదారులు మేళ వాయిద్యాలతో ఊరేగింపుగా సుమారు 1000 కేజీల పలురకాల స్వీట్స్, పండ్లు, పువ్వులు మరియు 115 కేజీల ‘బాహుబలి’ లడ్డుతో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి పూరిగుడి నుండి శ్రీ భీమేశ్వరస్వామి గుడి యూనియన్ బ్యాంకు రోడ్ తాలూకాఆఫీస్ రోడ్ మీదగా ఊరేగింపుగా వచ్చి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి సమర్పించారు.. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ భక్తులు తెచ్చిన సారెను సంప్రోక్షణ జరిపి..శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి సమర్పణ చేశారు అని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు.. 9 వ తేది ఆదివారం సాయంత్రం 6-30 కి మాలధారణ దీక్షదారుల పడి పూజ అత్యంత వైభవంగా జరగనుందని.. భక్తులు తరలి వచ్చి.. ఈ కార్యక్రమం చూసి తరించాలి అని కోరారు.
