సిగ్మా తెలుగు డాట్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, శుక్రవారం ఉదయం నుండి భక్తులు పోటెత్తిపోయారు. మధ్యాహ్నం సైతం ఎంతో దూరప్రాంతాల నుండి మహిళలు గుంపులు గుంపులుగా శ్రీ అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. ఇదిలా ఉండగా . శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రం నిధికి భీమవరం కి చెందిన వేగ్నేశ్న భరత్ కుమార్ వరలక్ష్మి నాగ ప్రసన్న దంపతులు 8 గ్రాముల బంగారం కానుకగా అందజేశారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు.వీరికి ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం అందించారు. ఆలయ చైర్మన్ బి నాగభూషణం మరియు ధర్మకర్తలు అమ్మవారి ఫోటో ప్రసాదాలు అందించారు.
