సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో భక్తులు సమర్పించే కొబ్బరిచెక్కలు ప్రోగు చేసుకునే హక్కు మరియు చీరలు పోగు చేసుకునే హక్కులకు సంబంధించి.నేడు, సోమవారం దేవాలయం కళా వేదికపై, 2 సంవత్సరాల కాల పరిమితి కి వేలం పాటలు నిర్వహించారు.. అందులో భాగముగా రెండు సంవత్సరాలు పాటు కొబ్బరిచేక్కలు పోగుచేసుకునేందుకు 50,61,000/- లభించింది. కాగా గత పాట 28,45,000/- ఈ మారు 22,16,000/- అదనంగా రికార్డు స్థాయి ఆదాయం రావడం జరిగింది. మరియు చీరలు జాకెట్ ముక్కలు మరియు పట్టుచీరలు ప్రోగుచేసుకునే హక్కుకు గత రెండు సంవత్సరాలు కాలానికి.. 1.21,27,500/- కాగా.. ప్రస్తుతం జరిపిన వేలం పాటలో రెండు సంవత్సరాల కాలానికి. 1.49.80,000/- లభించింది..కాగా ఈ మారు. 28.52.500/- అదనముగా రూ వచ్చినదని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
