సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు మంగళవారం ఆశ్వీయుజ శుద్ధపౌర్ణమి కావున ప్రజలు భక్తులు సుఖ శాంతి సౌభాగ్యాలతో ఉండాలని శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి వేదికపై చండీహోమం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు వేదపండితులు నిర్వహించారు. 70 మంది దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముందు ఆలయ పూర్వ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల రామలింగేశ్వర శర్మ గారి జ్ఞాపకార్థం వారి మనవడు మద్దిరాల రామకార్తీక్ ఇత్తడి మరియు రాగితో తయారు చేసిన సుమారు 53 కేజీల (1,50,000.) విలువ చేసే హోమగుండంను దేవస్థానానికి బహుకరించారు ఈ హోమగుండం ని ఆలయ ప్రధాన అర్చకులు సంప్రోక్షణ జరిపి చండీహోమం ని ప్రారంభించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *