సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో దూరప్రాంతం నుండి వచ్చే భక్తుల కోసం నిత్యం జరిగే నిత్యాన్నదాన వితరణ కు శ్రీ అమ్మవారిని దర్శించుకున్న రాజమండ్రి కి చెందిన భక్తులు బి రవీంద్ర కవిత దంపతులు (100,000) లక్ష రూపాయలు కానుకగా అందజేశారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందచేసినారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
