సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద భీమవరం శాసన సభ్యులు మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పులపర్తి అంజిబాబు సమక్షంలో నేడు, శుక్రవారం ఉదయం 7.30 గంటలకు మహా సుదర్శన హోమం భక్తులు ఉచితంగా పాల్గొనేలా నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు వేదపండితులచే అమ్మవారికి పూజ కార్యక్రమాలను నిర్వహించామని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియచేసినారు. విశేషంగా మహిళా భక్తులు హాజరు అయ్యారు. యాగంలో పాల్గొన్న 1500 మంది భక్తులకు అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని మరియు భోజన సదుపాయాన్ని కల్పించామని ప్రజల కష్టాలు తొలగొంచుకుని సిరి సంపదలు పొందాలని ఈ యాగాన్ని తలపెట్టామని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *