సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 3వ వార్డు కళాభవన్ వీధిలో గత ఆదివారం రాత్రి శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి మహా పడి పూజా కార్యక్రమాన్ని శ్రీ అమ్మవారి మండల దీక్ష మాలధారణ చేసిన వందలాది మాతలు నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పడిపూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ మావుళ్ళమ్మ తల్లి అస్సిసులతో సర్వ శుభాలు కలగాలని అభిలషించారు.జన్ను దుర్గ భవానీ ఆధ్వర్యంలో మావుళ్ళమ్మ మహా పడిపూజ జరిగింది. జై మాత .. జై మాత అంటూ ఆ ప్రాంతమంతా అమ్మవారి స్మరణతో మారుమ్రోగింది
