సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో ఖ్యాతి గాంచిన భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవాలు నేడు మంగళవారం ప్రారంభమయ్యాయి, నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి 62వ జాతర మహోత్సవంలో భాగంగా శ్రీ అమ్మవారి నగరోత్సవం ను హంస వాహనానికి ఎమ్మెల్యే అంజిబాబు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానన్నారు.రాష్ట్రంలోనే పేరుగాంచిన భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాలు నెలరోజులపాటు నిర్వహించడం గొప్ప విశేషమని అన్నారు. అనంతరం గరగల నృత్యాలతో డప్పుల వాయిద్యాలతో , బాణాసంచా కాల్పులతో ప్రత్యేక వాహనంపై అమ్మవారి గ్రామోత్సవాన్ని పట్టణ వీధుల్లో సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్, ధర్మ కర్తల మండలి సభ్యులు మరియు చైర్మన్ బోండాడ నాగ భూషణం, నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, భక్తులు పాల్గొన్నారు.నేటి సాయంత్రం 7 గంటల నుండి సాంస్కృతిక నాటక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.
