సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ దర్శించుకుని ప్రధానమంత్రి, నరేంద్రమోడీ గారి జన్మదినo సందర్భంగా వారి పేరు మీద ప్రత్యేక పూజలు జరిపించారు. వీరికి ఆలయ మర్యాదలతో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదాలు ఫోటో అందించారు. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో ఈ నెల 22 నుంచి ఘనంగా ప్రారంభం కానున్న 11 రోజుల శ్రీ దేవి శరన్నవరాత్రుల వేడుకల కర పత్రాలను, రోజువారి కార్యక్రమం వివరాలతో బుక్లేట్ ను స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆవిష్కరణ చేశారు. భక్తులకు సౌకర్యాలు కల్పనకు ప్రత్యేక శ్రద్ద కనపరచాలని, ప్రజలందరికీ శుభాలు కలిగేలా కార్యక్రమాలు చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, శ్రీమావుళ్ళమ్మ దేవస్థానం ధర్మకర్తల మాజీ చైర్మెన్ కారుమూరి సత్యనారాయణ మూర్తి , ఆలయ సిబ్బంది పాల్గొన్నారు
