సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సర్వ శుభ ప్రదమైన శ్రావణ మాసం నేపథ్యంలో భీమవరం పురాధీశ్వరి ప్రజల ఆరాధ్య దైవం శ్రీ మావూళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో విశేషంగా భక్తులు ఎంతో దూరప్రాంతాల నుండి వచ్చి సైతం శ్రీ అమ్మవారిని దర్శించు కొంటున్నారు. మరికొందరు చీర, సారె సమర్పించుకొంటున్నారు. నేడు, ఆదివారం సుమారు ఏనబై వేలు రూపాయలు విలువైన 8 గ్రాముల బంగారంను స్థానిక భక్తులు వెంకట హరీష్చంద్ర ప్రసాద్ అంజలి కుమారి దంపతులు శ్రీ అమ్మవారికి కానుకగా సమర్పించారు. .. వీరికి ప్రధానార్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించారు అని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు..
