సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో జరుగుతున్న శ్రీ ముత్యాలమ్మ మారెమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్ల 63వ జాతర మహోత్సవంలో నేడు, ఆదివారం స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక దేవాలయ పెద్దలు అంజిబాబు ను సన్మానించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామదేవతలకు చేసే జాతరలు ఆ గ్రామ శాంతిని కోరుకుంటాయని,తుందురు గ్రామంలో గత 62 ఏళ్లుగా ఎంతో సంప్రదాయ బద్దంగా వైభవంగా జాతర మహోత్సవాలను నిర్వహించడం చాల గొప్ప విశేషమని అన్నారు.
