సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అధికారం కోసం శ్రీరాజశ్యామల యాగం గురించి గత 6 ఏళ్లుగా బాగా ప్రచారంలోకి వచ్చింది. తెలంగాణ లో కెసిఆర్, ఏపీలో జగన్ లు విశాఖ శారదాపీఠం వారి ఆధ్వర్యంలో ఈ యాగం ఎంతో నిష్ఠతో చేసిన తరువాత ముఖ్య మంత్రులుగా అధికారంలోకి వచ్చారని ప్రచారం లో ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా అటుగా ద్రుష్టి మరల్చారు. దీనితో టీడీపీ అధినేత చంద్రబాబు తన నివాసంలో నేటి శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం నిర్వహిస్తారని తెలుస్తుంది. ఇందులో భాగంగా నేడు మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పాల్గొన్నారు. 50 మంది రిత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగియనుంది. దైవ కృప కోసం చంద్రబాబు కొద్దిరోజుల క్రితం శత చండి యాగం, మహా సుదర్శన హోమం కూడా చేసారు.
