సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం విశాఖ శారదాపీఠం వార్షికోత్సవం ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు, బుధవారం శ్రీ . రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు మరియు యాగం పూర్ణాహుతి లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్ చేరుకొన్న సీఎం జగన్ కు దారి పొడవున సీఎం జగన్ కు వైసీపీ శ్రేణులనుండి విశేష స్వగతం లభించింది. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ఆందోళనకు సిద్దమవుతున్న వామపక్షాల నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. దారి పొడవునా డ్వాక్రా మహిళలు.. సిద్ధం పోస్టర్లు జగన్మోహన్, స్వాగతం పలుకుతూ, మానవహారంగా ఏర్పాటు చేశారు. మరి కొద్దీ సేపటిలో శారదాపీఠం లో సాంప్రదాయ పద్దతిలో సీఎం జగన్ పూజలలో పాల్గొంటారు. . 2019 ఎన్నికల ముందు కూడా జగన్ విశాఖలో తన ప్రియ గురువుగా భావించే ‘స్వరూపానంద స్వామి’ ఆధ్వర్యంలో శ్రీ రాజ్య శ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చెయ్యడం తదుపరి విజయం సాధించాక మరల శారదాపీఠం కు వెళ్లి శ్రీ రాజ్య శ్యామల అమ్మవారికి మ్రొక్కులు చెల్లించుకోవడం అందరికి తెలిసిందే.. అయితే ఈ సారి ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఉండవల్లి లోని తన గెస్ట్ హౌస్ లో ఇటీవల 3 రోజుల పాటు శ్రీ రాజశ్యామల అమ్మవారి పూజలు చెయ్యడం విశేషం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *