సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి ప‌ర్వ‌దినాన గుంటూరుకారం, నా సామిరంగ‌, సైంథ‌వ్ వంటి మూడు అగ్ర హీరోల పెద్ద‌ చిత్రాల‌తో పోటీ ప‌డుతూ భీమవరం కుర్రోడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా వ‌చ్చిన చిన్న సినిమా.. హనుమాన్’ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా 300 కోట్ల కలెక్షన్స్ సాధిస్తూ ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో, ఇంకా సృష్టిస్తుందో అంద‌రికీ తెలిసిందే. ఒక్క భీమవరం పట్టణంలోనే కోటి రూపాయలు కలెక్షన్ దిశగా దూసుకొనిపోతున్నారు. దీనికి సీక్వెల్‌గా రానున్న జై హ‌నుమాన్ పై ఓ రేంజ్ లో అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా పార్ట్ 2 లో ‘రాముడికి హనుమంతుడిచ్చిన మాట ఏమిటి?’ అన్న ఆసక్తికర సాయింట్ తో ‘జై హనుమాన్‌’పై ఆసక్తి పెంచేసిన ప్రశాంత్‌ వర్మ.. దీంతో జై హునుమాన్ సినిమాలో హునుమంతుడిగా, శ్రీరాముడిగా ఎవరెవరు నటిస్తారో అంటూ, ఓ పెద్ద స్టార్‌ హీరోనే జై హనుమాన్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తారని చెబుతూ వస్తున్న ప్రశాంత్‌ వర్మ.. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… రాముడిగా మహేశ్ బాబు, ఆంజనేయుడిగా చిరంజీవిని నటింపజేయాలని ఉందంటూ చెప్పడంతో ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమా స్కేల్ పెద్దది కావడంతో చెప్పాల్సిన విషయాలు చాలానే ఉన్నాయని అగ్రనటులు అయితే మరింత బాగుంటుందని హనుమాన్ పాత్ర కు చిరంజీవి ని సంప్రదించామని, అలాగే రాముడి పాత్ర కు మహేష్ బాబు పర్ఫెక్ట్ అని ఇప్పటికే అయన ఫొటోలు రాముడిగా రి క్రియేట్ చేసి చూసుకొన్నామని చాల బాగున్నాయని రాజమౌళి షూటింగ్ లో ఉన్న మహేష్ ను కలసి ఆ పాత్ర కు అడుగుతానని ప్రశాంత్ వర్మ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *