సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం శ్రీరామనవమి సందర్భంగా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం, నవుడురుగరువు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, గూడూరి శ్రీనివాస్, రాధిక దంపతులు నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో నరసాపురం లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూడూరి ఉమాబాల, జగదీష్ దంపతులు పాల్గోవడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు వైసీపీ ఎంపీ అభ్యర్థుల కుటుంబాలు సంయుక్తంగా శ్రీ సీతారాముల వారి కల్యాణంలో పాల్గొనడం తదుపరి భక్తులు మరియు గ్రామాప్రజలతో మమేకం అవ్వడం జరిగింది. తదుపరి పాలకొల్లు మండలం, తిళ్ళపూడి గ్రామం రామాలయంలో జరిగిన సీతారామ కళ్యాణమహోత్సవంలో నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్దిని శ్రీమతి గూడూరి ఉమాబాల, జగదీష్ దంపతులు పాల్గొన్నారు. ఈ కళ్యాణ వేడుకలో పలువురు నాయకులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు ను వారు కలుసుకోవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *