సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పహల్గాం లో విహారానికి వచ్చిన అమాయక హిందువులను చంపిన ఉగ్రవాదులు నేడు, శనివారం చెన్నయి ఎయిర్ పోర్ట్ నుండి శ్రీ లంక చేరుకొన్నారని సమాచారం రావడం భారత్ అలర్ట్ అయ్యింది. శ్రీలంకలోని కొలంబోలో ఎయిర్ పోర్ట్ లో ఆగిన విమానం క్షుణంగా తనిఖీ చేసిన కొలంబో పోలీస్ బృందాలు ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొన్నారని వార్తలు వచ్చినప్పటికీ అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు. అయితే ఆ విమానం తనిఖీల అనంతరం గంట ఆలస్యంగా సింగపూర్ బయలు దేరటం గమనార్హం. ఇక్కడ భారత్ ప్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనపడుతుంది. అయితే .నిన్న మొన్నటి వరకు ఉగ్రవాదులు ఇండియాలోనే కచ్చితంగా ఉన్నారని ఎన్ఐఏ భావించింది.ఇదిలా ఉండగా నేడు శనివారం పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఆ దేశం నుంచి దిగుమతులన్నింటిపైనా నిషేధం విధించింది. దీనితో మొత్తం వాహనాల రాకపోకలు, వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి.
