సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నమో! వెంకటేశాయ! కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. అలాగే తమ కోర్కెలు తీర్చిన శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు భారీగా విరాళాలు ఇస్తుంటారు. తాజాగా నేడు, శుక్రవారం ఓ భక్తుడు స్వామి వారికి భారీ విరాళం అందజేశారు. గోయాంక అనేపారిశ్రామిక వేత్త శ్రీవారికి రూ.10 కోట్ల విలువ చేసే ఆభరణాలను సమర్పించారు. శంఖు, చక్రాలు, వరద, కటి హస్తాలను స్వామికి విరాళంగా ఇచ్చారు. ఆలయంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరికి గోయాంక ఈ విరాళాన్ని అందజేశారు.అలాగే నిన్న (గురువారం) ఓ ఎన్‌ఆర్‌ఐ కూడా వెంకన్నకు భారీ విరాళం సమర్పించారు. అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ ఆనంద్ మోహన్ భాగవతుల టీటీడీ ట్రస్టులకు కోటి 40 లక్షల రూపాలయను విరాళంగా ఇచ్చారు.
