సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ దంపతులు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నేడు శనివారం తెల్లవారుజామున కలియుగ వైకుంఠం తిరుమల లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సర్వదర్శనంలో ఉత్తర ద్వారం నుండి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకునే అదృష్టం నాకు కలగడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, 2024 ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రి గా జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టడం ఖాయమమని దానికి శ్రీ స్వామివారి అస్సిసులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. గత శుక్రవారం కాణిపాకమ్ లో స్వయం భూ శ్రీ వినాయక స్వామికి ప్రత్యేక పూజలు చేసారు.. గ్రంధి శ్రీనివాస్ దంపతులు.. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *