సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి భక్తులకు వచ్చే జూలై కోటాకు సంబంధింది శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను నేడు, గురువారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. నేటి 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇదిలా ఉండగా.. నేడు రాత్రి 8గంటల నుంచి 9 గంటల నడుమ బంగారు వాకిలి చెంత ఆలయ అర్చ కులు శ్రీరామ పట్టాభిషేక మహత్సవం నిర్వహిస్తారు. ఇక స్వామివారి కల్యోణోత్సవం , ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను వచ్చే ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10గంటలకు ఆన్ లైన్‌లో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా అదే రోజు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జులై నెల కోటాను మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేయనున్నా రు. వీటితో పాటు ఏప్రిల్ 23న ఉదయం 10గంటలకు జులై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు టీటీడీ ఆన్ లైన్‌లో విడుదల చేస్తారు.
