సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కలియుగ వైకుంఠం తిరుమలలో పవిత్ర గోవుల మృతి వివాదం కొనసాగుతుండగానే మరో ప్రక్క శ్రీవారి భక్తులుకు ఆందోళన కలిగించే ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నేడు, ఆదివారం తిరుమల రెండో ఘాట్ రోడ్డు లో శ్రీవారి దర్శనార్థం తిరుపతి నుంచి తిరుమలకు ప్రయాణిస్తున్న భక్తుల వాహనం మంటల్లో దగ్ధం అయ్యింది. ( ఫై చిత్రంలో..) కారులో పొగలు రాగానే, వెంటనే అప్రమత్తమైన డ్రైవర్వాహనాన్ని పక్క కు తీసుకొనివెళ్ళగా అందులోని వారు కారు దిగి అక్కడి నుంచి పరుగు తీశారు. అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసారు. ఇలాగే గత శుక్రవారం కూడా తిరుమలలో కారు దగ్ధమైంది. అయితే అందులో కూడా ప్రయాణించిన ఒంగోలు కు చెందిన 5గురు భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. తిరుమలలో కౌస్తుభం గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న కార్ పార్కింగ్ వద్ద ఏసీ ఆన్ చేయడం వల్ల కారులో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగి, కారు కాలిపోయింది.
