సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో మాత్రమే కాదు తిరుమల లడ్డు ప్రసాదంలో జగన్ ప్రభుత్వ హయాంలో నెయ్యి బదులు ఆవు, చేప.. పశువుల కొవ్వు కలిసిందని సాక్షాత్తు సీఎం చంద్రబాబు, ఇవే లడ్డులు అయోధ్య కు పంపారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటించడంతో దేశవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఎంతో మదన పడ్డారు. ఈ వివాదంపై వైసీపీ పెద్దలు సుప్రీం కోర్టుకు వెళ్లారు… దీనిపై ‘సుప్రీం కోర్ట్’ కలుగజేసుకొని హిందూ మనోభావాలు దెబ్బతినేలా ఎవరు ఇలా బహిరంగ ప్రకటనలు వద్దని, దీనిపై ముందు సిబిఐ దర్యాప్తు చెయ్యాలని ఆదేశించిన నేపథ్యంలో.. తాజగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంలో సీబీఐ పర్యవేక్షణలో తన సిట్ విచారణను పూర్తిచేసింది. సుమారు 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో దర్యాప్తు జరిపి నెల్లూరులోని ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. అయితే లడ్డు నెయ్యిలో ఎటువంటి పశువుల కొవ్వులు కలపలేదని తెచ్చి చెప్పింది. అయితే తిరుమల కు నెయ్యి సరఫరా చేస్తున్న ఉత్తరాఖండ్‌కు చెందిన ‘భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ’ అనే సంస్థ ఒక్క లీటరు పాలు కూడా సేకరించకుండానే నెయ్యిని తయారు చేసినట్లు సీబీఐ గుర్తించింది.శుద్ధమైన ఆవు నెయ్యికి బదులుగా పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ వంటి చౌకబారు నూనెలను కలిపినట్లు విచారణలో వెల్లడైంది. ఈ భారీ కుంభకోణం ఎప్పటి నుండి జరుగుతుందో? కానీ దీనిలో బయటి వ్యక్తులతో పాటు టీటీడీలోని కొందరు కీలక సీనియర్ అధికారులు కూడా కుమ్మక్కయ్యారు. టీటీడీ మాజీ ప్రొక్యూర్‌మెంట్ జనరల్ మేనేజర్ సుబ్రమణ్యం సహా ఏడుగురు సిబ్బంది నిందితుల జాబితాలో ఉన్నారు. అపట్లో ఈ నెయ్యి వ్య్వవహారాలు పరిశీలించిన మంత్రి పార్ధసారధి ఇప్పుడు కూటమిలో మంత్రిగా కొనసాగుతుండటం గమనార్హం. ఈ కేసులో టీడీపీ. జనసేన నేతలు ఆరోపించినట్లు మాజీ టీటీడీ బోర్డు చైర్మెన్ లు భూమన కరుణాకర్ రెడ్డి, వై వి సుబ్బారెడ్డి పాత్రలు ఉన్నట్లు ఎక్కడ చార్జిషీటులో పేర్కొనక పోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *