సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉగాది తరువాత మంత్రి లోకేష్ ఏపీ సీఎం కాబోతున్నారని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఉప ప్రధానిగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు, మీడియా సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్న కు స్పందించారు. చంద్రబాబు ఉప ప్రధానా? ఎవరు చెప్పినారు? సామీ.. గొప్ప సంగతే ఇది. చంద్రబాబును ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలే బరాయించలేకున్నారు..ఇక ఉప ప్రధానిగా దేశ ప్రజలు ఏం బరాయిస్తారంటూ” వైఎస్ జగన్ సెటైర్లు వేశారు. మీడియా సమావేశంలో చంద్రబాబు సర్కార్ ఫై జగన్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. కేంద్ర సంస్థ కాగ్ రిపోర్ట్ ప్రకారం.. రాష్ట్రంలో అభివృద్ధి లేదు కానీ అప్పులు మాత్రం లక్షల కోట్ల లో చేస్తూ ..దోచుకో దాచుకో అన్నట్లు అవినీతి మయం చేయరని అన్నారు. తిరుపతి లడ్డు లో కల్తీ జరిగింది వైసీపీ హయాంలో కాదని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అని సిబిఐ రిపోర్ట్ లో తారీకుల తో సహా స్వష్టంగా ఉందని త్రిప్పి పంపించిన నెయ్యి లారీలను కూడా ఎక్కువ ధర చెల్లించి మరల లడ్డు ల తయారీలో వాడేసిన ఘనత వారిదే అని సాక్ష్యాలతో సహా దొరికిపోయారని, మీరు తప్పు చేసి మా పాలనపై కి గెంటేస్తారా ? అని విమర్శించారు.చంద్రబాబు కు దేవుడుఅంటే భక్తి లేదు.. నమ్మకం లేదని తిరుమల పవిత్రతను దెబ్బ తీసేలా బి ఆర్ నాయుడు చేష్టలు చేస్తుంటే ఇంకా పదవిలో కొనసాగిస్తున్నారని ,లడ్డు నెయ్యి లో డ్రామాలు ఆడి హెరిటేజ్ కు అనుబంధం అయిన ఇండాపూర్ డైరీ , లేదా వైష్ణవి సంగం డైరీ , తదితర మీ వ్యక్తులు హయాంలో సంస్థలకు అధికధరలకు నెయ్యి టెండర్ ఆమోదించి ఇప్పటికే 200 కోట్ల పైగా స్వామివారి సొమ్మును అవినీతి చేసారని జగన్ సంచలన ఆరోపణ చేసారు.
