సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి శ్రీవారి స్పెషల్ ప్రవేశ దర్శనం ఆన్లైన్ కోటా టికెట్లు ఈనెల13న ఉదయం 9గంటలకు విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీవారి ఆలయంలో కొన్ని అనివార్య కారణాలవల్ల ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను టీటీడీ విడుదల చేయలేదు. బాలాలయం కార్యక్రమం వాయిదా పడటంతో ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు నిలిపివేసిన టికెట్లను వచ్చే సోమవారం విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. అలాగే మార్చి నెలకు సంబంధించి అంగప్రదక్షిణ టోకెన్ల కోటాతో పాటు ఈనెల 23 నుం చి 28 వరకు విడుదల చేయని కోటాను రేపు ఫిబ్రవరి 11వ తేదీ రేపు శనివారం ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చెయ్యనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *