సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు విశేషంగా వేలాదిగా హాజరు అవుతున్నారు. నేటి మంగళవారంతో ఆలయ ఆవరణలో ప్రతి సాయంత్రం వేదికపై నిర్వహిస్తున్న కార్యక్రమాలకు 2 రోజుల పాటు విశ్రాంతి ఇవ్వనున్నారు. నేటి సాయంత్రం సినీ మ్యూజికల్ నైట్ ,రాత్రి 8 గంటల నుండి గయోపాఖ్యానం నాటకం ప్రదరిస్తున్నారు. 14వ తేదీ న భారీ అన్నసమారాధనతో వేడుకలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో నేడు, మంగళవారం శ్రీ అమ్మవారు శ్రీ విజయలక్ష్మి దేవిగా భక్తులకు విజయాలు ప్రసాదిస్తూ అస్సిసులు అందజేస్తున్నారు. ( పై చిత్రంలో),, నేడు, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న సూళ్లూరుపేట కి చెందిన ఐ.చంద్రశేఖర్ రావు చంద్రమతి దంపతులు 15 గ్రాముల బంగారం కానుకగా సమర్పించారు. వీరికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొప్పేశ్వరరావు పూజలు నిర్వహించి ప్రసాదాలు శేషవస్త్రం అందచేసారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి తెలిపారు.
