సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, భీమవరం వారి ఆధ్వర్యంలో నేడు, బుధవారం (ది.03.12.2025 తేదీన) స్థానిక కళాశాలలోని శ్రీమతి బి. సీతా ఇండోర్ ఆడిటోరియం నందు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, కె.వి. విష్ణు రాజు, అధ్యక్షతన నిర్వహించబడిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ కె. మధు మూర్తి, సెంటర్ ఫర్ విజువల్లీ ఛాలెంజెడ్, మేనేజింగ్ ట్రస్టీ, డాక్టర్ యు.వి. రమణ రాజు పాల్గొన్నారు. వివిధ అంగవైక్యల్యాలతో బాధపడుతున్న స్కూలు విద్యార్థులకు, కళాశాల యొక్క అసిస్టివ్ టెక్నాలజీ లేబోరేటరీలలో విద్యార్థులు తయారుచేసిన సాంకేతిక సహాయక ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అతిధుల చేతుల మీదుగా, భీమవరం వాస్తవ్యురాలు,కె. విజయ లక్ష్మి కి సుమారు రూ. 1,20,000/- ల విలువైన ట్రై బైక్ ను కళాశాల తరఫున ఉచితంగా అందజేయడం జరిగింది. భీమవరం మరియు రాజమండ్రి నగరానికి చెందిన సెంటర్స్ ఫర్ విజువల్లీ ఛాలెంజెడ్ లో చదువుతున్న అంధ విద్యార్థులకు, ఈ-స్టిక్ లు, ప్రపంచ, భారతదేశ మరియు ఆంధ్ర రాష్ట్ర ఎలక్ట్రానిక్ మ్యాప్స్, మెడికల్ డిస్పెన్సెర్, ఆబ్జెక్ట్ డిటెక్షన్, లాంటి వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలను, మరియు ఇతర ఉపయోగకర పరికరాలను ఎంపిక చేసిన లబ్దిదారులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది
