సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్ శ్రీ విష్ణు హీరోగా ఇటీవల ఈ మార్చి నెల మొదటి వారంలో రిలీజ్ అయిన ‘మృత్యుంజయ్’ సినిమా టాక్ బాగున్నప్పటికీ థియేటర్స్ లో ఆశించిన విజయం సాధించలేకపోయింది. అయితే తనదైన కామెడీతో వినోదం పంచే హీరో శ్రీవిష్ణు (Sree Vishnu).. ఈసారి విభిన్నంగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ వద్ద పని చేసిన హుస్సేన్ షా కిరణ్ ని దర్శకుడిగా పరిచయంచేస్తూ సీరియస్ క్రైమ్ కదంశంతో నటించడం ప్రేక్షకులు ఆస్వాదించ లేకపోయారు. అయితే మంచి టేకింగ్ ఉన్న సినిమాగా ‘మృత్యుంజయ్’ ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ లో నెట్ ఫ్లిక్స్ (Netflix )లో వచ్చే వారం ఏప్రిల్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కచ్చితంగా ఓటిటి లో మంచి రేటింగ్ సాధించే అవకాశాలు ఉన్నాయి.
