సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రముఖ పుణ్యక్షేత్రం స్వామివారి జ్యోతిర్లింగం వెలసిన శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేడు, శుక్రవారం వైభవంగా మొదలయ్యాయి. నేటి, ఉదయం శ్రీస్వామివారి యాగశాల ప్రవేశం చేసి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. నేటి సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ జరుగనుంది. ఈరోజు నుంచి ఈనెల 11వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రేపటి (శనివారం) నుంచి శ్రీ స్వామి అమ్మవారికి వివిధ వాహనసేవలు, శ్రీశైల పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించనున్నారు.ఈ నేపథ్యంలో ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్పర్శ ( స్వామివారిని తాకడం)దర్శనాలను రద్దు చేసారు. 8న స్వామివారికి సంప్రదాయంగా ప్రతి ఏడాది పాలకొల్లు సమీపంలోని బగ్గేశ్వరం చేనేత కళాకారులతో నేయించిన పాగాలంకరణ, కల్యాణోత్సవం సందర్భంగా భక్తులు భారీగా తరలి రానున్నారు.అయితే శివ స్వాములకు మాత్రం ఈ నెల 5 తేదీ వరకు విడతల వారీగా మల్లికార్జున స్వామిని తాకేందుకు స్పర్శ దర్శనం కల్పించనున్నారు.
