సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దక్షిణ కైలాసం గా పేరొందిన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవం గా జరుగుతున్నాయి. నేడు, ఐదోవరోజు ఆదివారం ఉత్సవాల సందర్భంగా సాయంత్రం 5:30 గంటలకు విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం తరఫున అధికారులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆది దంపతులకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి రావణ వాహనంపై ఆశీనులై నేడు పురవీధులలో కన్నులపండువగా గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఈనెల 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినానికి హాజరు అయ్యే లక్షలాది భక్తులకు భారీ ఏర్పట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి ఈ నెల 24, 25వ తేదినుండి ప్రభుత్వ ఆర్టీసీ వందలాది ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
