సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; దేశంలోనే ఖ్యాతి గాంచిన జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు అధ్యక్షతన నేడు, శనివారం జరిగిన సమావేశంలో 11 కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ప్రత్యేక దర్శన టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఉచిత లడ్డూలతో పాటు ఆలయ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలని పాలక మండలి నిర్ణయించింది. డిసెంబరు 1వ తేదీ నుంచి స్వామి వారి 500 రూపాయల (స్వామివారిని భక్తులు స్వయంగా ముట్టుకోవడానికి) ‘స్పర్శ’ దర్శన టికెట్‌పై రెండు 100గ్రాముల లడ్డూలు, రూ. 300 సర్వదర్శన టికెట్‌కు ఒక లడ్డూను ఉచితంగా ఇచ్చేందుకు ఆలయ బోర్డు ఆమోదించింది. ఇక శ్రీశైలం క్షేత్రంలో భక్తులకు కలుగుతున్న అసౌకర్యాల గురించి ఫిర్యాదులు, సలహాలను తెలిపే బాక్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భక్తుల సౌకర్యార్థం క్షేత్ర పరిధిలో ప్రధాన కూడలిలలో హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.అలాగే శ్రీగిరిలో జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని తీర్మానించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *