సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీశైలం లో మహా శివరాత్రి వేడుకలకు కాలినడకన వెళ్తున్న భక్తులపై ఓబులవారిపల్లె మండలం గుండాలకోన అటవీ ప్రాంతంలో ఏనుగులు గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఏనుగుల గుంపు దాడి చేయడంతో వెంటనే తమ ప్రాణాలను రక్షించుకునేందుకు భక్తులు తీశారు. అయినప్పటికీ ఏనుగులు వారి వెంట పడి మరీ ప్రాణాలు తీశాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడిన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను రైల్వేకోడూరు ఆస్పత్రికి తరలించారు. ఏనుగుల దాడిలో నలుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, అలాగే గాయపడిన వారికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు డిప్యూటీ సీఎం పవన్. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు ఆదేశించారు.
