సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహాశివరాత్రి వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో నేడు, శుక్రవారం శ్రీశైలం దేవస్థానానికి తొలిసారిగా స్వర్ణరథం సమకూరింది. ఇప్పటివరకు స్వామి, అమ్మవార్లకు వెండిరథంపైనే ఊరేగిస్తున్నారు. వైసిపి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి దంపతులు శ్రీశైల మల్లికార్జునస్వామికి స్వర్ణ రథం తయారు చేయించారు. రూ.11 కోట్ల వ్యయంతో 23.6 అడుగుల ఎత్తుతో రథం తయారు చేయించారు. నేడు, రథసప్తమి సందర్భంగా మల్లన్న స్వామివారికి కానుకగా సమర్పిస్తారు. సంప్రోక్షణ అనంతరం రథశాల నుంచి నంది గుడి వరకు స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తున్నారు. . ఈ కార్యక్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎంపీ వేమిరెడ్డి దంపతులు పాల్గొననున్నారు. బంగారు రథం మధ్యలో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, కుమారస్వామి మూర్తులు కొలువుదీరాయి. స్వామి, అమ్మవార్ల చుట్టూ అష్టదిక్పాలకులు, ముందుభాగంలో రెండు పెద్ద అశ్వాలు స్వారీ చేస్తున్నట్లు తీర్చిదిద్దారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *