సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానమున శ్రీ అమ్మవారి జేష్ఠ మాసం జాతర మహోత్సవాలు గత గురువారం ముగిసాయి. దేవాలయంలో శ్రీ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి, పట్టణంలో ఇంటిటికి వెళ్లి అమ్మవారి అస్సిసులు అందజేసిన గరగల కు పుష్ప అలంకరణ చేసిన ఉయ్యాలసేవ నిర్వహించి, శ్రీ అమ్మవారి గర్భ గుడిలో ప్రవేశపెట్టడంతో జేష్ఠమాస జాతర ముగిసింది. ఈ కార్యక్రములో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు మరియు సభ్యులు ముత్యాల వెంకట రామారావు తాళ్లపూడి భాగ్యలక్ష్మి గోపిశెట్టి విజయలక్ష్మి పాల్గొన్నారు పై కార్యక్రమములో ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వణాధికారి వై భద్రాజీ పర్యవేక్షించారు.
