సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో ఈ నెల 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. తదుపరి 27వ తేదీ శుక్రవారం భక్తులకు మహా ప్రసాద వితరణ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజు నిలువెత్తు మూలవిరాట్ స్వరూపంలో శ్రీ అమ్మ వారు 9 రోజుల పాటు పలు దేవి అవతారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. దేవాలయ ఆవరణలో ప్రత్యేక కుంకుమ పూజలతో పాటు పలు ఆధ్యాత్మిక,సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు శ్రీ అమ్మవారి దర్శనం వేగంగా జరిగేటట్లు సౌకర్యాల విషయంలో ఇబ్బందులు లేకుండా విశేష ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఈ కార్యక్రమాలను దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్. మానేపల్లి నాగేశ్వరరావు మరియు ధర్మకర్తలు ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ నెల 28వ తేదీ నుండి భక్తుల కోర్కెలు తీర్చే బంగారు తల్లి శ్రీ మావుళ్ళమ్మవారి 40 రోజుల మండల దీక్షలు పారంభం అవుతున్నాయి. ఆసక్తి గల భక్తులు దేవాలయం వద్ద వివరాలు తెలుసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *