సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవస్థానంలో శ్రీ అమ్మవారిని నేడు, శనివారం ఉదయం ఆంద్రప్రదేశ్ హై కోర్ట్ జడ్జి, బి కృష్ణ మోహన్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ ముఖ్య అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో ఆహ్యానించి శ్రీ అమ్మవారికి ఆయనతో పూజలు నిర్వహించారు. తదుపరి శ్రీ అమ్మవారి శేష వస్త్రం, శ్రీ అమ్మవారి జ్ఞాపిక ప్రసాదం లను ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి యర్రంశెట్టి భద్రాజీ మరియు ఆలయ ధర్మకర్త రామాయణం సత్యనారాయణ అందజేశారు.
