సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, గురువారం పౌర్ణమి నేపథ్యంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య చండి హోమం’ ను ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో పండితులు నిర్వహించారు. శ్రీ అమ్మవారి భక్తులు , ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సర్వ శక్తి స్వరూపిణి ని ప్రార్ధిస్తూ వేదపండితులు యాగం నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో 76 మంది దంపతులు పాల్గొన్నారని , దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *