సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జేష్ఠమాస జాతర మహోత్యవాలు నేడు, శనివారం దేవాలయ ఆవరణలో ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ అమ్మవారిని నిలబెట్టే కార్యక్రమం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి పుట్టింటి, అత్తింటి వారుగా భావించే అల్లూరి, మెంటే వారి వంశస్తులుచే ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ శాస్త్ర ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ అమ్మవారి ప్రతి రూపంగా గరగాలను నెత్తి ఫై పెట్టుకొని కళాకారులూ నృత్యాలు చెయ్యడం హారతులు అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షించారు.
