సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 59వ వార్షిక మహోత్సవములు వచ్చే జనవరి 13 నుండి ప్రారంభిస్తున్న నేపథ్యంలో నెల రోజులు పాటు జరిగే ఈ ఉత్సవాలకు చలువ పందిళ్ళ ఏర్పాట్లు ప్రారంభ సూచికగా శ్రీ అమ్మవారికి ప్రత్యక పూజలతో నేడు, గురువారం దేవాలయ ఆవరణలో మొదటి పందిరి రాట ను ముహూర్తం ఈరోజు ఉదయం 11 గంటలకు నిలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు దేవాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *