సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్వీ ఎఫ్-12 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నేటి , సోమవారం ఉదయం షార్ రాకెట్ ప్రయోగ కేంద్రంలోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి సరిగ్గా 10:42 గంటలకు నిప్పులు చెరుగుతూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆపై నిర్ణీత సమయంలో ఎన్‌వీఎస్ – 01 ఉపగ్రహాన్ని రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం దేశీయ నేవిగేషన్ సేవలు అందించనుంది. జీఎస్ఎల్వీ ఎఫ్ – 12 రాకెట్ పొడవు 51.7 మీటర్లు, బరువు 420 టన్నులు. 2,232 కిలోల బరువున్న ఎన్‌వీఎస్‌-01 జీవితకాలం 12 ఏళ్లు. రాకెట్ ప్రయోగం సక్సెస్ అవడంతో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మిషన్ కంట్రోల్ సెంటర్‌లో శాస్త్రవేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ.. జీఎస్‌ఎల్వీ ఎఫ్-12 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. ఎన్‌వీఎస్ – 01 ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరిందని చెప్పారు. దేశీయ నావిగేషన్ వ్యవస్థ కోసం త్వరలో మరో నాలుగు ఉపగ్రహాలని పంపుతామని తెలిపారు. చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమవుతున్నామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *